జాతీయంరాజకీయాలు

కరోనా వ్యథ:బతికించండి.. లేదంటే చంపేయండి

Corona intensity in Maharashtra

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా దారుణాలకు కారణమవుతోంది. మహారాష్ట్రలో అయితే మరణ మృదంగాన్నే వాయిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేక స్టార్ హోటల్ లను సైతం మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆస్పత్రులుగా మార్చేస్తోంది.

కరోనా తీవ్రతతో ఆక్సిజన్ కొరత తీవ్రమై ఎక్కడా సిలిండర్లు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల పరిస్థితి కడు దయనీయంగా మారుతోంది. ఎన్ని వేలు , లక్షలు పోద్దామన్నా ఇప్పుడు మహారాష్ట్రలోని ఆస్పత్రుల్లో ఓ ఖాళీ బెడ్డూ, ఆక్సిజన్ సిలిండర్ దొరకని పరిస్థితి ఉంది.

తాజాగా తన తండ్రిని బతికించుకునేందుకు ఓ యువకుడు మహారాష్ట్ర నుంచి తెలంగాణ ఆస్పత్రికి వచ్చిన దైన్యం వెలుగుచూసింది. ఇక్కడా ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు. ఆక్సిజన్ లేక తండ్రి దగ్గుతూ అవస్థలు పడుతుంటే చూడలేక మీడియా ముందుకొచ్చాడు. తన తండ్రికి బెడ్ అయినా ఇవ్వండి లేదంటే ఇంజక్షన్ వేసి చంపేయండి అంటూ మీడియా ముందు మొరపెట్టుకున్న యువకుడి దైన్యం చూస్తే దేశంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన సాగర్ కిశోర్ అనే వ్యక్తి తండ్రికి కరోనా సోకింది. అంబులెన్స్ లో తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చంద్రపూర్ లో ఎక్కడా ఖాళీలు లేవు. రోగులు బారులు తీరి ఉన్నారు. పక్క పట్టణాలకు వెళ్లినా అదే పరిస్థితి. సరిహద్దుల్లోని తెలంగాణకు తీసుకొచ్చాడు. ఇక్కడ పడకలు అందుబాటులో లేవు. ప్రైవేటులోనూ అదే పరిస్థితి. దీంతో మహారాష్ట్రకు తిరిగి తీసుకెళ్లిపోయాడు.

అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోతుండడం.. తండ్రి దగ్గుతో సతమతమవుతుండడంతో తండ్రిని బతికించుకోలేక తన తండ్రిని చంపనైనా చంపండి.. లేదంటే ఒక బెడ్ ఇవ్వండి అంటూ మొర పెట్టుకున్న తీరు అందరి హృదయాలను కలిచివేస్తోంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత.. రోగుల దుస్థితికి అద్ధం పడుతోంది ఈ ఘటన..

Back to top button