తెలంగాణరాజకీయాలు

తెలంగాణలోనూ కరోనా ఆంక్షలు..?

Telangana
పొరుగున ఉన్న మహారాష్ట్రను కరోనా ఏవిధంగా అయితే ఠారెత్తిస్తోందో… తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే.. మహారాష్ట్రలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువ ఉండడంతో ఇప్పటికే ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించారు. అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి ఆదేశాలను వెంటనే అమల్లోకి తెచ్చింది. అయితే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి తరహా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. దీంతో అక్కడి డీఎంహెచ్‌వోలు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూనే ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే మహారాష్ట్ర లాంటి పరిస్థితులే మనకూ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల్లో సైతం బెడ్లు దొరికే పరిస్థితులు ఉండవని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తొందరగా చర్యలు చేపట్టాలని.. కట్టడి చేయకుంటే మరింత ప్రాణ నష్టం చవిచూడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

డీఎంహెచ్‌వోల హెచ్చరికలు, సూచనలతో ప్రభుత్వంలో కూడా స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. అన్నిశాఖల అధికారులతో ఈ మేరకు సమావేశం కానున్నారని తెలిసింది. ఈ మీటింగ్‌లో వారి వారి అభిప్రాయాలు తెలుసుకొని.. కరోనా కట్టడికి ఎలాంటి ఆంక్షలు పెట్టాల్నో తెలుసుకోనున్నారు. అయితే.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించనున్నారు. లాక్‌డౌన్‌ పెడితే ప్రజల ఆర్థిక కష్టాలు కూడా మరోసారి దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అందుకే.. లాక్‌డౌన్‌ లాంటి కఠిన చర్యలను అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు నడుస్తున్నాయో ఇక్కడా వాటిని అమలు చేయాలని అనుకుంటున్నారని సమాచారం. బార్లు, సినిమా హాళ్లపై మున్ముందు ఆంక్షలు పెట్టే అవకాశాలు సైతం లేకపోలేదన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో కేసీఆర్‌‌ పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Back to top button