ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

ఉద్యోగులను టెన్షన్ పెడుతున్న కరోనా.. 57 శాతం మందిలో ఆ సమస్య..?


భారత్ లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ అంచనాలకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే కరోనా మహమ్మారి ఉద్యోగులను ఎక్కువగా టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. ఉద్యోగుల్లో అనేక ఆరోగ్య సమస్యలకు ఈ మహమ్మారి ప్రత్యక్షంగా/ పరోక్షంగా కారణమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మూతబడ్డాయి. ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు ఎప్పుడు ఉద్యోగం కోల్పోతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

ఒక సర్వే ప్రకారం భారత్ లో ఏకంగా 57 శాతం మంది ఉద్యోగం విషయంలో టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. 54 శాతం మంది మరో సంవత్సర కాలంలో తాము ఉద్యోగం కోల్పోయి అవకాశం ఉందని భావిస్తున్నారని సమాచారం. ‘జాబ్స్‌ రిసెట్‌ సమ్మిట్‌’ ఆన్ లైన్ లో నిర్వహించిన ఒక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. భారత్ తో పాటు ఇతర దేశాల్లో సైతం ఉద్యోగులు తమ ఉద్యోగాల విషయంలో ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇతర దేశాలతో రష్యాలో ఏకంగా 75 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగం పోతుందని భయాందోళనకు గురవుతున్నారు. మరి కొందరు ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయినా ఇబ్బందులు ఎదురు కాకూడదని నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

Back to top button