కరోనా వైరస్

తాగునీటిలో కరోనా వైరస్.. ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ తాజాగా చేసిన పరిశోధనల్లో తాగునీటిలో కరోనా వైరస్ ఉంటుందని తేలిన సంగతి తెలిసిందే. తాగునీటి టెంపరేచర్, అందులో ఉండే ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్ బ్రతికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడినీళ్లలో 65 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ జీవించే అవకాశం ఉండదు. అయితే 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రం వైరస్ కు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంటుంది.

నీటిలోని వైరస్ ఇన్‌ఫెక్షన్‌ ను కలిగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వైరస్ శరీరంలోకి వెళ్లాలంటే కొన్ని వందల కణాలు శరీరానికి అవసరమవుతాయి. తాగునీటి ద్వారా కరోనా బారిన పడినట్టు మన దేశంలో ఎక్కడా వెల్లడి కాలేదు. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు, గాలి ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం గమనార్హం. మరోవైపు కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందో శాస్త్రవేత్తలు సైతం చెప్పలేకపోతున్నారు.

అందరూ కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవడం మరియు జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో కరోనాకు కొత్త మందులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో పెద్దగా మార్పులు లేవని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటే మంచిది.

గాలి, వెలుతురు లేని గదుల్లో ఎక్కువ సమయం గడపకూడదు. జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Back to top button