కరోనా వైరస్జాతీయంప్రత్యేకంరాజకీయాలువైరల్

కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా?  

వైరస్ కణాల ఫొటోలను తీసిన శాస్త్రవేత్తలు

Carona virusకరోనా రక్కసి ఎలా ఉంటుంది. పేపర్లు, చానెల్స్ లో చూపినట్టు బొడిపెలుగా రోమాలు నిక్కబొడుకొని ఉంటుందా? నల్లగా ఉంటుందా? ఎరుపు రంగులో ఉంటుందా? అసలు ఈ వైరస్ కణాలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి ఉంది. తాజాగా కరోనా వైరస్ కణాల ఫొటోలను శాస్త్రవేత్తలు తీశారు. వాటిని ప్రచురించారు.

మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్ ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కరోనా కణాలను ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు పరిశీలించారు.  న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. మాస్కుల ద్వారానే కోవిడ్ ను నియంత్రించవచ్చని ఈ పరిశోధన ద్వారా తేలిందన్నారు.

కరోనా వైరస్ సోకిన కణాలు శ్వాసకోశాల్లో ఎలా ఉంటాయనేది ఫొటోల్లో స్పష్టంగా కనిపించింది. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించింది ఈ చిత్రాల్లో గుర్తించారు.  శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందనేది సులభంగా అర్థమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు.

మానవ శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతా వ్యాపించడంతోపాటు ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు.

దీన్ని బట్టి వేగంగా విస్తరించే ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు మాస్క్ శానిటైజర్ చేతులు శుభ్రంగా ఉంచుకోవడమే మార్గం అని తేల్చారు.

Back to top button