అత్యంత ప్రజాదరణఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

వామ్మో.. కరోనా సోకితే కంటిచూపు పోతుందా?

Corona Second Wave In HYD

దేశంలో ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. పలు రాష్ట్రాల్లో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నా కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం గమనార్హం. ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన 7 నుంచి 12 రోజుల తరువాత రోగుల ఆరోగ్యం క్షీణించేది. కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం కేవలం నాలుగైదు రోజులలోనే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటం గమనార్హం.

Also Read: కంగారు పెడుతున్న కరోనా

గతంలో పెద్ద వయస్సు వారిలో మాత్రమే కరోనా వైరస్ తీవ్ర లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం మాత్రం పెద్దవయస్సు వాళ్లతో పాటు యువతలో కూడా కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. మాస్క్ ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే మాత్రమే కరోనా సోకకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కరోనా సోకిన వాళ్లలో మరో కొత్త లక్షణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండి ఆక్సిజన్‌ బెడ్, వెంటిలేటర్‌పైకి వెళ్లిన వాళ్లలో రెటీనా ఇన్‌ఫ్లమేషన్‌ కనిపిస్తోందని ఈ లక్షణం కరోనా కొత్త లక్షణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లో ఏకంగా 4432 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: పరగడుపున రాగిజావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

లక్షణాలు లేని వారి నుంచే కరోనా సోకే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు వెల్లడించారు. క్యాంటీన్లు, కెఫెటేరియాలలో మరింత జాగ్రత్తగా ఉండాలని.. ఇప్పటికే కరోనా సోకిన వాళ్లకు మళ్లీ కరోనా సోకే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు

Back to top button