ప్రత్యేకంబ్రేకింగ్ న్యూస్సినిమాసినిమా బ్రేకింగ్ న్యూస్సినిమా వార్తలు

సీనియర్ హీరో, హీరోయిన్లకు ఏడాది జైలు శిక్ష

court orders imprisonment for radhika sarathkumar

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న సీనియర్ హీరో హీరోయిన్లకు షాక్ తగిలింది. వారిద్దరికి ఓ కేసు విషయంలో ఏడాది జైలు శిక్ష పడింది.

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సీనియర్ హీరో, హీరోయిన్ రాధిక-శరత్ కుమార్ జంటకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని స్పెషల్ కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ దంపతులకు ఏడాది జైలు శిక్ష పడడం తమిళ సినీ, రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనమైంది.

తమిళ సినీ పరిశ్రమలో శరత్ కుమార్, రాధిక, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా గతంలో సినిమాలు నిర్మించేవారు. ఈ క్రమంలోనే రేడియన్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నారు.

అప్పు చెల్లించేందుకు 2017లో రేడియన్స్ సంస్థకు చెక్ అందజేశారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో రేడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు రాధిక దంపతులకు ఏకంగా ఏడాది జైలు శిక్ష వేస్తున్నట్టు ప్రకటించి సంచలన తీర్పునిచ్చింది.

Back to top button