ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

కరోనా గురించి భయపడుతున్నారా.. ఈ డైట్ పాటిస్తే మీరు సేఫ్..?

covid 19 food diet tips for corona virus recovery
covid 19 food diet tips for corona virus recovery

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడ్డామంటే కోలుకోవడం అంత తేలిక కాదు. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కరోనా వేగంగా విజృంభిస్తుండగా సెకండ్ వేవ్‌లో కరోనా సోకినా చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. కరోనా లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని వైద్యులు సిటీ స్కాన్ ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కరోనా సోకుతుందనే భయాందోళన ఉన్నా, కరోనా బారిన పడినా డైట్ లో కీలక మార్పులు చేసుకుంటే మంచిది. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కరోనా సోకకుండా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఆహారంలో విటమిన్-క్, జింక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, మంచి పోషకాలు లభిస్తాయి. రాగి లేదా ఓట్స్‌లో ఫైబర్, విటమిన్-బ్, సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయి. ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం ద్వారా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కరోనా వల్ల జ్వరంతో బాధపడుతుంటే కిచిడీ తింటే మంచిది. ఇందులో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు శరీరానికి మేలు చేస్తాయి.

నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఎలాంటి అనారోగ్యం నుంచైనా సులభంగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఓఆర్ఎష్, కొబ్బరి నీరు, హెర్పల్ టీ తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి.

Back to top button