ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

కరోనా బాధితులకు మరో షాక్.. డయాబెటిస్ వచ్చే ఛాన్స్..?

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతిరోజూ 40,000కు అటూఇటూగా కొత్త కేసులు నమోదవుతుండగా రికవరీలు సైతం అదే స్థాయిలో ఉండటం గమనార్హం. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల వచ్చే ప్రమాదాల్లో డయాబెటిస్ కూడా ఒకటని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.

551 మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చర్లు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 46 శాతం బాధితులలో డయాబెటిస్ లక్షణాలు కనిపించలేదని 35 శాతం మందిలో మాత్రం ఆరునెలల పాటు ఈ లక్షణాలు కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించడం గమనార్హం.

నెఫ్రాలజీ డివిజన్ కు చెందిన పౌలో ఫియోరినా ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికలను కన్ఫామ్ చేశారు. హైపర్‌గ్లైమిక్ పేషెంట్స్ పరిస్థితి దారుణంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. వీరికి ఆక్సిజన్ అవసరం ఏర్పడటంతో పాటు ఐసీయూ ట్రీట్మెంట్ ఎక్కువగా అవసరమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది.

హైపర్‌గ్లైమిక్ పేషెంట్స్ లో హార్మోన్ లెవెల్స్ కూడా సరిగ్గా లేవని గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో కరోనా ఎక్కువకాలం ఉన్నవారిలోనే ఈ తరహా సమస్యలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డయాబెటిస్ రకం వల్ల ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి సమస్యలు వస్తున్నాయని సమాచారం.

Back to top button