టాలీవుడ్సినిమా

సినీ సెలబెట్రీల విరాళాల్లో ప్రభాస్ టాప్

కరోనా పేరు చెబితే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేపట్టింది. కరోనా నివారణకు పలువురు సీని రాజకీయ ప్రముఖులు విరాళాలను అందజేస్తూ తమవంతు సహకారం అందజేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4కోట్ల విరాళాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభాస్ గురువారం రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. తాజాగా పీఎం సహాయనిధికి 3కోట్లు రూపాయాలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పవన్ కల్యాణ్ ప్రకటించిన 2కోట్ల రూపాయాలను విరాళాన్ని బీట్ చేసి ప్రభాస్ టాప్ ప్లేస్ చేరుకున్నారు.

కరోనా నివారణ కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలను ప్రకటించారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2కోట్లు, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు కోటి రూపాయలు, ఎన్టీఆర్ 75లక్షలు, రాంచరణ్ 70లక్షలు, బాలకృష్ణ 50లక్షలు, నితిన్ 20లక్షలు, సాయిధరమ్ తేజ్ 10లక్షలు, అల్లరి నరేష్ 5లక్షలు, అలీ 2లక్షల విరాళాలను ప్రకటించారు.

నిర్మాత దిల్ రాజు దేశంలోని ఒక్కో రాష్ట్రానికి 10లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ 20లక్షలు, అనిల్ రావుపూడి 10లక్షలు, కొరటాల శివ 10లక్షలు కేటాయించారు. అలాగే జీవితా రాజశేఖర్ దంపతులు, మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సీని కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడులోని సీనీ ప్రముఖుల కోసం సూపర్ స్టార్ రజనీ 50లక్షలు, విజయ్ సేతుపతి 50లక్షలు, సూర్య, కార్తీ 10లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.