క్రీడలుజాతీయం

Shikhar Dhawan : శిఖ‌ర్ ధావ‌న్ భార్య సంచ‌ల‌న పోస్ట్‌.. విడిపోయార‌ట‌! విడాకులు తీసుకున్న భార‌త క్రికెట‌ర్లు వీరే

Shikhar Dhawan : టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ దంప‌తులు విడిపోయారు. ఈ విష‌యాన్ని ధావ‌న్ భార్య అయేషా ముఖ‌ర్జీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయేషా సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు, ధావ‌న్ అభిమానులు షాక్ కు గుర‌య్యారు. ఏం జరిగిందంటూ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు.

Shikhar Dhawan : టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ దంప‌తులు విడిపోయారు. ఈ విష‌యాన్ని ధావ‌న్ భార్య అయేషా ముఖ‌ర్జీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయేషా సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు, ధావ‌న్ అభిమానులు షాక్ కు గుర‌య్యారు. ఏం జరిగిందంటూ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. శిఖ‌ర్‌-అయేషా వైవాహిక జీవితాన్ని ప‌రిశీలిస్తే…

వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఆస్ట్రేలియాలో ప్రొఫెష‌న‌ల్ కిక్ బాక్స‌ర్ అయిన అయేషాను.. 2012లో పెళ్లి చేసుకున్నాడు ధావ‌న్‌. అయితే.. అయేషా ముఖ‌ర్జీకి గ‌తంలోనే పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరికి ఒక బాబు జ‌న్మించాడు. అయితే.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి తాము విడిపోతున్న‌ట్టు ఆయేషా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో సుదీర్ఘ‌మైన పోస్టు చేసింది.

‘‘మొదటి సారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో విఫలమైనట్టు, తప్పు చేస్తున్నట్టు భావించాను. నా తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్టు భావించాను. ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోవాల్సి రావ‌డం అనేది ఊహించుకుంటేనే భ‌యంక‌రంగా ఉంది. ఈ స‌మ‌యంలో న‌న్ను నేను మ‌ళ్లీ నిరూపించుకోవాల్సి ఉంది.’’ అని పోస్టు చేసింది అయేషా. అయితే.. ఈ విష‌య‌మై శిఖ‌ర్ ధావ‌న్ ఇంకా స్పందించ‌లేదు.

ఇదిలాఉంటే.. మ‌రికొంద‌రు టీమిండియా క్రికెట‌ర్లు కూడా విడాకులు తీసుకున్నారు. వారిలో మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజహారుద్దీన్ కూడా ఉన్నారు. ఆయ‌న తొలుత‌ నౌరీన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు క‌లిగారు. ఆ త‌ర్వాత నౌరీన్ కు విడాకులు ఇచ్చి, 1996లో న‌టి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకున్నాడు అజ‌హార్‌.

మాజీ టీమిండియా పేస‌ర్ జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయ‌న తొలుత జ్యోత్స్న అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత అభిప్రాయ భేదాలు రావ‌డంతో.. ఆమెతో విడిపోయారు. అనంత‌రం మాద‌వి పాత్ర‌వాలి అనే జ‌ర్న‌లిస్టును జీవిత భాగ‌స్వామిని చేసుకున్నారు.

మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ కూడా మొద‌ట నోయెల్లా లూయిస్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కాంబ్లీ చిన్న‌నాటి స్నేహితురాలు. కానీ.. ఆ త‌ర్వాత వీరి కాపురంలో క‌ల‌త‌లు వ‌చ్చాయి. దీంతో.. ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత మాజీ మోడ‌ల్ ఆండ్రియా హెవిట్ ను వివాహం చేసుకున్నాడు కాంబ్లీ.

క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ మొద‌టి భార్య వ‌నిత‌.. స‌హ‌చ‌ర క్రికెట‌ర్ ముర‌ళి విజ‌య్‌ తో రిలేష‌న్ న‌డుపుతున్న విష‌యం తెలుసుకొని విడాకులు ఇచ్చాడు. ఆ త‌ర్వాత 2015లో స్క్వాష్ ప్లేయ‌ర్ దీపికా ప‌ల్లిక‌ల్ ను కార్తీక్ వివాహం చేసుకున్నాడు. అనంత‌రం కార్తీక్ మొద‌టి భార్య వ‌నిత‌, ముర‌ళి విజ‌య్ పెళ్లి చేసుకోవ‌డం విశేషం.

మ‌రో భార‌త క్రీడాకారుడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ కూడా మొద‌టి భార్య‌తో విడాకులు తీసుకున్నాడు. హాసిన్ జ‌హాన్ అనే మ‌హిళ‌కు అంత‌కు ముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు ష‌మీ. 2012లో ఐపీఎల్ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. రెండేళ్ల డేట్ త‌ర్వాత 2014లో వీరు ఒక్క‌ట‌య్యారు. కానీ.. ఆ త‌ర్వాత క‌ల‌త‌లు రావ‌డంతో.. ఇద్ద‌రూ విడిపోయారు.

Back to top button