ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

చంద్రబాబుపై క్రిమినల్ కేసు

Chandrababuఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అదేదో దాడులు కాదు, అన్ పార్లమెంటరీ పదాలు కావు ఏపీలో కరోనా కొత్త వైరస్ వేరియంట్ ఎన్ 440కే విస్తరించిందని చెప్పినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. సుబ్బయ్య అనే వ్యక్తి ద్వారా చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బి)(2) కింద కేసు పెట్టారు. ఏపీలో రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రతి విషయానికి కేసుల వరకు వెళ్లడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భావిస్తున్నారు. అధికారమే సోపానంగా ఇరు పార్టీలు పావులు కదుపుతూ ప్రజలను తప్పుదవ పట్టస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వింత ధోరణితో రాజకీయాలంటే అసహ్యం వేసే విధంగా ఉన్నాయని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పటికే దేవినేని ఉమపై కేసు
టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు(ఉమ)పై సైతం కేసు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసు పెట్టి వైసీపీ నేతల చౌకబారు తనాన్ని ప్రదర్శించుకుంటున్నారు. రాజకీయమనే పరమపద సోపానంలో పావులుగా ప్రజలను వాడుకుంటున్నారు. రోజురోజుకు టీడీపీ,వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల నేతలు కేసుల విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. చిన్న విషయాలను పెద్దవిగా చేస్తూ బూతద్దంలో చూస్తూ హంగామా సృష్టిస్తున్నారు.

పరిస్థితి మారదా?
పక్క స్టేట్లను చూసైనా వీరిలో మార్పు రావడం లేదు. తమిళనాడులో సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించిన స్టాలిన్ ను చూసైనా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నైతికతకు ప్రాధాన్యమిస్తూ విలువలకు ప్రాణం పోస్తూ రాజకీయాల్లో తమ ఉనికిని కాపాడుకోవాలే తప్ప తుచ్ఛమైన రాజకీయాలు చేస్తూ చులకన కావడం బాధాకరం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు వచ్చేలా హుందాగా వ్యవహరించి రాజకీయాలపై ప్రజలకు అసహ్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీలపై ఉంది. ఇందు కోసం అధినేతలు తమ అనుయాయులకు దిశానిర్దేశం చేయాలి. మంచి ప్రవర్తనతో మెలగాలని సూచిస్తూ మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.

కనిపించని నైతికత
రాజకీయాల్లో నైతికత దెబ్బతింటోంది.నైతికత మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో ప్రజలు సైతం రాజకీయాలంటే ఆసక్తి చూపడం లేదు. రాజకీయాలకు భాష్యం చెప్పిన మహామహులు స్థాపించిన పార్టీలు నేడు అసభ్య పదజాలంతో అన్యాక్రాంతమవుతున్నాయి. విలువలే పెట్టుబడిగా నైతికతే ప్రాణంగా చూపించాల్సిన పార్టీలు సొంత ప్రయోజనాల కోసమే అర్రులు చాస్తున్నాయి. పార్టీ బలం పెంచుకునే క్రమంలో ఎదుటి పార్టీపై బురద జల్లే పనులే చేస్తున్నాయి. ఈ సంప్రదాయాలకు చరమగీతం పాడాలి. మంచి నడవడికతో పార్టీ ఆశయాల సాధనకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.

Back to top button