టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఘాటు ఫోటోల పై విమర్శలు, విష్ణుప్రియ స్పందన !

Vishnu Priyaఈ సోషల్‌ మీడియా పుణ్యమా అని చిన్నాచితకా భామలు కూడా ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు మహానటి లాంటి నటీమణులకు అభిమానులు ఉండేవారు. కానీ, మన దౌర్భాగ్యం.. యూట్యూబ్ దయతో సడెన్ గా రాత్రి రాత్రికే స్టార్ అయిపోతున్నాం అని ఫీల్ అయ్యేవాళ్ళు కూడా రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. దానికి తగ్గట్లుగానే యువత కూడా పిచ్చి పిచ్చి కామెంట్లతో టైమ్ పాస్ చేస్తోంది.

యాంకర్ విష్ణుప్రియని ఆమె అభిమానులు రిక్వెస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఆమె సారీ కట్టుకున్న ఫొటోలను షేర్‌ చేసింది. అయితే కరోనాతో జనం చనిపోతుంటే ఏమిటి ఈ పోస్ట్ లు అనేవాళ్ళు కొందరు అయితే, సారీ బాగాలేదు, మంచి హాట్ ఫోటోలు పెట్టు అని కోరేవాళ్ళు కొందరు. ఏది ఏమైనా విష్ణుప్రియను మాత్రం కొందరు నెటిజన్లు తెగ విమర్శించడం చాల కాలంగా వస్తోన్న ఆనవాయితీ.

ఆ విమర్శల విషయానికి వస్తే.. “అక్కా మీ ప్రియా చూడు ఎలాంటి ఫోటోలు పెడుతుందో అంటూ హేళన చేస్తున్నారు. ఫోటోలు మంచిగ పెట్టు అక్కా, బయట వాళ్ళ ముందు మా ముఖాలు చూపించలేకపోతున్నాం” అంటూ దియా అనే అభిమాని అట, విష్ణుప్రియ మీద అసహనం వ్యక్తం చేస్తూ.. మంచి ఫొటోలు పెట్టు అని ఒక సలహా ఇచ్చాడు. మరి తన అభిమాని ఇచ్చిన సలహాకి విష్ణుప్రియ లాంటి మహానటి స్పందించకపోతే ఎలా ?

అందుకే విష్ణుప్రియ స్పందిస్తూ.. ‘నానా దియా. నువ్వు రాయిలో కూడా దేవుడిని చూడవచ్చు. అదంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది’ అంటూ ఇంతకీ ఈ కొటేషన్ ఎక్కడ నుంచి కాపీ కొట్టిందో గానీ, విష్ణుప్రియ ఓ రేంజ్ లో సలహా ఇచ్చింది. ‘నా వృత్తిలో రకరకాల బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల బట్టలా లేక పీలికలు బట్టలా క్లారిటీ ఇస్తే బాగుండేది.

ఇక పనిలో పనిగా తన బట్టల విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని ఆ భగవంతుడు తన ఆ అభిమానికి ఇవ్వాలని కోరుకుంది విష్ణుప్రియ. అంతేకాని ఇక పై ఘాటు ఫోటోలు పెట్టను అని చెప్పడానికి మాత్రం విష్ణుప్రియకు మనసు రాలేదు.

Back to top button