ఆంధ్రప్రదేశ్మిర్చి మసాలారాజకీయాలు

నాగబాబు ట్వీట్లపై కొనసాగుతున్న విమర్శల పర్వం!

గాడ్సేను పొడిగిన నాగబాబు తీరుపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. గాంధీని చంపిన హంతకుడిని ఎలా ప్రశంసిస్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నాథురాం గాడ్సే జయంతి రోజు నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఈ ట్వీట్లపై అనేకమంది నెటిజన్లు ఇలా స్పందించారు.

“ఈ క్షణం నుండి…మీ పై ఉన్న అభిమానం..గౌరవం రెండూ పోయాయి. దిగజారడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మీ లెక్కన ప్రతీ హంతకుడికి కూడా ఒక కారణం ఉంటుంది..లాడెన్ తో సహా..!
వాళ్ళ పుట్టిన రోజులకూ ఇలానే పోస్టులు పెడతారా?” అని విజయ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

“మీ మాటలు ఎలా ఉన్నాయంటే ” కసబ్ కూడా మంచి వాడే.. పాపం తను నమ్మిన సిద్దాంతం కోసం యుద్ధం చేశాడు . తన దేశభక్తి ని శంకించలేం. ” అన్నట్లుంది. మీ వల్ల మళ్ళీ జనసైనికులు గౌరవం పోయేలా చేస్తున్నారు.” అని బాలు అనే వ్యక్తి కామెంట్ పెట్టారు.

“ఈ ట్వీట్ చూడగానే కొంత మంది ఆవేశం తో నాగబాబు అనే వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు తప్పు లేదు వాక్కు స్వాతత్ర్యం కానీ ఆయన ఉద్దేశం తెలుసుకోలేదు
సరిగ్గా అలాగే నాధురాం అనే వ్యక్తి గాంధీ అనే వ్యక్తిని చంపాడు , ఇదే కేసు ఈ రోజు కోర్టులో వేస్తే,” అని ప్రవీణ్ అనే వ్యక్తి కామెంట్ పెట్టారు.

ఈ విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు నాగబాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు.

గాడ్సే ని పొగుడుతూ నాగబాబు పెట్టిన ట్వీట్ ఇదే..

”నాధురాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’అని ట్వీట్ చేశారు నాగబాబు.

నాగబాబు వివరణ

ఆ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నాగబాబు వివరణ ఇచ్చారు. ‘నేను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్ నాథూరాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. ఆయన వెర్షన్ కూడా జనాలకు తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే ఎంతో గౌరవం ఉంది. నిజం చెప్పాలంటే నన్ను విమర్శించే వాళ్ల కన్నా నాకు ఆయనంటే ఎనలేని గౌరవం అని చెప్పుకొచ్చారు నాగబాబు. మొత్తానికి నాగబాబు నాథూరామ్ గాడ్సేపై చేసిన ట్వీట్ ఆయనకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.