ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఏపీలో కర్ఫ్యూ: ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Night Curfew

దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను దాదాపు ఎత్తివేశాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ లాక్ చేసేసింది. అన్ని పనులు సాఫీగా సాగుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రాత్రి కర్ఫ్యూ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా సీఎం జగన్ మాత్రం సడలింపులు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. ఏపీలో రాత్రి కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను ఏపీలో అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 11 లక్షల డోసులను ఆదా చేశామని.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ వందశాతం వ్యాక్సినేషన్ చేసినట్లు జగన్ తెలిపారు. విదేశాలకు వెళ్లే 31వేల మందికి పైగా వారికి టీకాలు వేశారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే టీచర్లకు వేసే ప్రక్రియను మొదలుపెట్టామన్నారు.

ఇలా టీకాలు వేయడంలో ముందుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విషయంలో మాత్రం ఇంకా సడలింపులు ఇవ్వకపోవడం విశేషంగా మారింది.

Back to top button