తెలంగాణ

Cyber Crime: నగ్నంగా కనిపించి కవ్విస్తారు..ఆ తర్వాత..

Girls Scams through Video call

మగువ మాటలకు లొంగని మగాడు ఉండడు. వారి మాటల్లో కమ్మదనం మగవారిని అంతలా రెచ్చగొడుతుంది. పైగా నగ్నంగా చూడాలనుకుంటున్నారా అంటూ రెచ్చగొట్టే మాటలతో కవ్విస్తున్నారు. అంతటితో ఆగకుండా వారిని నిలువునా దోచుకుని గుల్ల చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నారా అంటూ మాటలు కలుపుతూ వారిలో ఆశలు పెంచుతున్నారు. వలపు వలలో చిక్కేలా చేసి వారిని చిన్నాభిన్నం చేస్తున్నారు. జరిగిన మోసం ఎవరితో చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. విశాఖకు చెందిన యువకుడి నుంచి జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి(24) రూ.24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

కుత్బుల్లాపూర్ లోని ఓ కాల్ సెంటర్ లో 25 మంది అమ్మాయిలు పనిచేసేవారు. అది మూతపడడంతో వీరందరు అక్కడే పనిచేసే టీం లీడర్ కృష్ణ జిల్లా కు చెందిన షాహిక్ అబ్దుల్ రమమాన్ (30) వీరిని చేరదీశాడు. వారికి మోసాలు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చాడు. దీంతో వారు తమ నైపుణ్యత ప్రదర్శిస్తూ కిలేడీల అవతారం ఎత్తారు. వీరిపై సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి.

మార్కెటింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, కాల్ సెంటర్ల నుంచి బల్క్ ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు నంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా ఊరిస్తున్నారు. దీంతో వారికి ఫోన్ రాగానే వారిని కబుర్లలోపెట్టి మాటలతో మభ్యపెడుతున్నారు. మీకు ఏ రకంగా కావాలంటూ రెచ్చగొడుతున్నారు. మీకు నగ్నంగా కావాలా అంటూ ఎర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిక్కు కు గురైన వారిని తమ గుప్పిట్లో పెట్టుకుని వారితో అన్ని రకాలుగా మాయమాటలు చెప్పి వారిని నగ్నంగా ఉంచి వారి ఫొటోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్టు పెడతామని బెదిరిస్తూ రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు.

మోసపోయామని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. రాష్ర్టంలో చాలా మంది ఇలా మోసాలకు గురయిన వారే. అమ్మాయిలు తమ గొంతులతో మాయాజాలం సృష్టిస్తున్నారు. లేనిపోని మాటలు చెబుతూ వారిని రొంపిలోకి దింపి డబ్బులు వసూలు చేసి చివరికి ఏమి జరగకుండానే దివాలా తీసేలా చేస్తున్నారు. లక్షలు మాయం కావడంతో వారు పోలీసులను ఆశ్రయించి జరిగిన మోసాన్ని చెప్పుకుని దిగులు పడుతున్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నారు.

Back to top button