టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

రెచ్చిపోయిన‌ గ‌ణేష్ మాస్ట‌ర్.. వాళ్ల‌పై దారుణ‌మైన‌ కామెంట్స్‌!

తెలుగు టీవీ హిస్ట‌రీలో ఎవ‌ర్ గ్రీన్ జోనర్ డ్యాన్స్‌. ఏదో ఒక ఛాన‌ల్ లో ఏదో ఒక పేరుతో నిత్యం కొన‌సాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి షోల‌లో ఒక‌టి ‘ఢీ’. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ డ్యాన్స్ షో బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. తెలుగు బుల్లితెర చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ షోగా కొన‌సాగుతోంది. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది జ‌డ్జిలుగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ కొరియో గ్రాఫ‌ర్ గ‌ణేష్ మాస్ట‌ర్ కూడా ఈ షోకు జ‌డ్జిగా ఉన్నారు.

గ‌ణేష్ మాస్ట‌ర్ కూడా ఈ ఢీ షో నుంచే వ‌చ్చిన‌వారు కావడం గ‌మ‌నార్హం. టాప్ కొరియోగ్రాఫ‌ర్లుగా ఉన్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌, జానీ మాస్ట‌ర్ కూడా ఢీలో పెర్ఫార్మ్ చేసిన‌వాళ్లే. ప్ర‌స్తుతం ప‌ద‌మూడో సీజ‌న్ కొన‌సాగుతోంది. వ‌చ్చే బుధ‌వారం ప్ర‌సారం కాబోతున్న షోకు సంబందించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఓ కంటిస్టెంట్ వ‌కీల్ సాబ్ చిత్రాన్ని థీమ్ గా తీసుకొని డ్యాన్స్ చేశాడు. ఈ సంద‌ర్భంగా ప‌లికిన ప‌వ‌న్ డైలాగులు స్పెష‌ల్ గా ఉన్నాయి. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల గురించి చెప్పే డైలాగులతో అంద‌రూ ఎమోష‌న్ ఫీల్ అయ్యారు.

ఈ పెర్ఫార్మ‌న్స్ పూర్త‌యిన త‌ర్వాత ఎమోష‌న్ ఆపుకోలేక‌పోయిన గ‌ణేష్ మాస్ట‌ర్‌.. ‘‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఆవేదనను వకీల్ సాబ్ రూపంలో చూపించారు’’ అని గట్టిగా అరిచారు. అంతేకాకుండా.. చిన్నపిల్లలపై జరుగుతున్న అరాచకాలను ప్రస్తావించిన గణేష్ మాస్టర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘అరేయ్ దొంగ **కొడ‌క‌ల్లారా.. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర ఏం క‌నిపిస్తోందిరా మీకు?’’ అంటూ ఆగ్ర‌హంతో కూడిన ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ స‌మ‌యంలో ఎమోష‌న్ ఆపుకోలేక ఏడ్చేశారు. ఇది చూసిన మిగిలిన జ‌డ్జీలు ప్రియ‌మ‌ణి, పూర్ణ కూడా ఎమోష‌న్ ఫీలైపోయారు. గ‌ణేష్ మాస్ట‌ర్ ను ఓదార్చారు. సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది, ర‌ష్మీ తోపాటు మిగిలిన వాళ్లు కూడా ఎమోష‌న్ ఆపుకోలేక‌పోయారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Back to top button