ఓవర్సీస్ షో టైమింగ్స్సినిమాసినిమా రివ్యూస్

‘దర్బార్‌’ మూవీ రివ్యూ

 

టైటిల్‌: దర్బార్‌

జానర్‌: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

నటీనటులు: రజనీకాంత్‌, నయనతార, నివేదా థామస్‌, యోగిబాబు, సునీల్‌ శెట్టి,

సంగీతం: అనిరుద్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్‌ మురగదాస్‌

బ్యానర్‌: లైకా ప్రొడక్షన్‌

రేటింగ్: 2.5/5

 

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ: ముంబై పోలీసు కమిషనర్‌ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్‌) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్‌స్టర్‌లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్‌కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్‌ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్‌గా క్లీన్‌ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్‌, హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ గ్యాం‍గ్‌లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్‌ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్‌ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్‌లార్డ్‌, మొబ్‌స్టర్‌ అయిన హరిచోప్రా (సునీల్‌ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ..

 

సాంకేతిక విభాగం: దర్శకుడు మురగదాస్ భారీ విజువల్స్ తో భారీ యాక్షన్ తో చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలు మరియు కథ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన సంగీతం చాల బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న యాక్షన్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కెమరామెన్, దర్శకుడి ఆలోచనకు తగ్గట్లు భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. మెయిన్ గా రజినిని చాల యంగ్ గా చూపించారు. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. సూపర్ స్టార్ తో ఇలాంటి ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించినందుకు సుభాష్ శరన్ ను అభినందించాలి.

 

పెర్ఫార్మన్స్: ర‌జ‌నీకాంత్ వ‌న్‌మేన్ షో అని చెప్పొచ్చు. ఆయ‌న కుర్రాడిలాగా చాలా హుషారుగా క‌నిపించారు. ఫైట్ స‌న్నివేశాల్లోనూ, డ్యాన్సుల్లోనూ చాలా బాగా న‌టించారు. అభిమానుల్ని అది మ‌రింత‌గా మెప్పించే విష‌యం. బ్యాడ్ పోలీస్‌గా ఆయ‌న చేసే సంద‌డి అల‌రిస్తుంది. కూతురు నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ చ‌క్కటి సెంటిమెంట్‌ని పండించారు. నివేదా థామ‌స్ అభిన‌యం మెప్పిస్తుంది. న‌య‌న‌తార పాత్ర ప‌రిధి చిన్నదే అయినా ఉన్నంత‌లో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేసింది. సునీల్ శెట్టి ప్రతినాయ‌కుడిగా మెప్పిస్తాడు. పేరుకు పెద్ద డాన్ కానీ ఆ ప్రభావం రెండు మూడు స‌న్నివేశాల్లో మాత్రమే క‌నిపిస్తుంది. యోగిబాబు ర‌జ‌నీతోపాటే క‌నిపిస్తూ న‌వ్వించాడు. ఇక మిగిలిన పాత్రలు మామూలే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం, అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి. ముఖ్యంగా నేప‌థ్యం సంగీతం, దుమ్ము ధూళి పాట‌తో అనిరుధ్ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, ఆయన స్టైల్‌పైనే ఎక్కువ‌గా ఆధార‌పడ్డాడు మురుగ‌దాస్‌. తన మార్కుగా పేరున్న కొన్ని మైండ్‌గేమ్ స‌న్నివేశాల్ని మాత్రం ఇందులో బాగా చూపించారు.

 

బలాలు

రజనీకాంత్‌ స్టైలిష్‌ లుక్‌, మ్యానరిజమ్‌

కూతురిగా నివేదా థామస్‌ నటన

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

 

బలహీనతలు

రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం

ఒకింత రోటిన్‌ కథ కావడం, రోటిన్‌ క్లైమాక్స్‌

Back to top button