అత్యంత ప్రజాదరణక్రీడలుజాతీయంరాజకీయాలు

ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం.. సన్ రైజర్స్ కు షాక్

మరో రెండు నెలల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న వార్నర్ దూరమవ్వడం ఆ జట్టును షాక్ కు గురిచేసింది.

Also Read: ఐపీఎల్ టోర్నీ మొత్తం ఒకే వేదిక‌పై..? కార‌ణం ఇదేన‌ట‌!

సన్ రైజర్స్ జట్టుకు వార్నర్ యే బలం.. బలగం. అతడే చాలా సార్లు జట్టును సెమీస్ కు చేర్చాడు. గత సారి కూడా సెమీస్ వరకు తీసుకొచ్చాడు. కానీ ఈసారి జట్టుకు దూరమవ్వడాన్ని సన్ రైజర్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు.

ఇటీవల ఇండియాతో జరిగిన రెండో వన్డేలో డేవిన్ వార్నర్ ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయం అవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్ లో పాల్గొన్నాడు. అయితే గాయం మానకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు.

Also Read: ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే.. ఇద్దరు యువ క్రికెటర్లకు చోటు

ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ కు కూడా వార్నర్ దూరమయ్యాడు. వికెట్ల మధ్య పరిగెత్తలేకపోతున్న వార్నర్ త్రో కూడా చేయలేకపోతున్నాడట.. ఆరు నుంచి 9 నెలల సమయం అతడు కోలుకోవడానికి పడుతుంది ఈ ఐపీఎల్ కు వార్నర్ అందుబాటులో ఉండడని సమాచారం. అదే జరిగితే సన్ రైజర్స్ గెలుపు అవకాశాలు క్లిష్టంగా మారడం ఖాయం.

Back to top button