అప్పటి ముచ్చట్లుబాలీవుడ్

హీరోయిన్ పై హీరో ప్రేమ.. సినిమా కథను మించిపోయింది

Deepika Ranveer
డేటింగ్.. ప్రస్తుతం ఈ పదం సాధారణ యువతలో కూడా రోజురోజుకూ సర్వసాధారణం అయిపోతుంది. ఒకప్పుడు సినిమా తారలకు మాత్రమే.. ఈ పదం అంకితం అనుకుంటే.. కాలం మారేకొద్దీ జనాలు కూడా డేటింగ్ అంటూ తమ వ్యక్తిగత జీవితాలతో నానా రచ్చ చేస్తున్నారు. ఈ డేటింగ్ వ్యవహారం సినిమా రంగంలో.. ముఖ్యంగా బాలీవుడ్ లో మరీ ఎక్కువ. అక్కడ డేటింగ్ చేయని హీరోయిన్ లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతలా బాలీవుడ్ హీరోయిన్ల జీవితాల్లో డేటింగ్ జీర్ణయించుకుపోయింది. అసలు చాలామంది బాలీవుడ్ స్టార్ కపుల్ డేటింగ్ చేసిన తరువాతే పెళ్లి చేసుకుని ఒక్కటి అయ్యారు.

రెగ్యులర్ గా జరుగుతున్న ఈ తంతులో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఉన్నా.. బాలీవుడ్ భామ దీపికా పదుకోణే వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అమ్మడు హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి చాన్నాళ్ల పాటు ఘాటు ప్రేమాయణం నడిపి.. మొత్తానికి పెళ్లి కూడా చేసుకుంది. అయితే దీపికాకి రణవీర్ సింగ్ అంటే మొదటినుండి చిన్న చూపు అట. ఆమె రణ్ బీర్ తో ప్రేమాయణం సాగిస్తోన్న రోజుల్లో.. రణవీర్ సింగ్ తో ఎప్పుడూ గొడవ పడుతూ.. అతన్ని హేళన చేస్తూ మాట్లాడేదట.

మొదట్లో రణవీర్ సింగ్ కూడా దీపికా మాటలను సరదాగా తీసుకున్నప్పటికీ.. 2013లో వచ్చిన రామ్ లీల సినిమాలో మొదటిసారి వీళ్లద్దరూ కలిసి నటించారు. ఆ రోజుల్లో దీపికాతో నటించేటప్పుడు ఆమె పై రణవీర్ సింగ్ కీ ప్రేమ పుట్టిందట. అప్పటికీ దీపికా రణ్ బీర్ కి దూరంగా జరిగి, ఒక బిజినెస్ మెన్ కొడుకుతో ప్రేమలో మునిగి తేలుతుంది. ఆమె ప్రేమ వ్యవహారాలు అన్ని దగ్గర నుండి చూసాకా కూడా, రణవీర్ సింగ్ మాత్రం ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉండేవాడు అట. అతని ప్రేమను అర్ధం చేసుకున్న దీపికా అప్పటినుండి అతనితో ప్రేమను నడిపింది.

అయితే ఎప్పుడూ అతనితో డేటింగ్ చేయడానికి మాత్రం ఇష్టపడలేదట. ఏమైనా అంతకుముందు ప్రియులతో డేటింగ్ చేసిన దీపికా.. తనకు కాబోయే భర్తతో మాత్రం ఎన్నడూ డేటింగ్ చేయలేదట. అయినా ఏడేళ్లు ఓపిక పట్టి రణవీర్, దీపికను పెళ్లి చేసుకున్నాడు. ఏమైనా రణవీర్ సింగ్ ప్రేమ కథ, సినిమా లవ్ స్టోరీని మించిపోయేలా ఉంది.

Back to top button