బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

దీపికా పదుకొనెకు చేదు అనుభవం నలిపేసిన ఫ్యాన్స్.. అరిచిన హీరోయిన్‌!

Deepika Padukone
ఇప్పుడు బాలీవుడ్లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రంటే.. వినిపించే పేరు ‘దీపికా పదుకొనె’. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా ఎదిగిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బీటౌన్ ను ఊపేస్తోంది. అయితే.. ఈ అమ్మ‌డు వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది సౌత్ లో కావ‌డం విశేషం. ‘ఐశ్వర్య’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. షారూఖ్ ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పుడు టాప్ స్టార్ గా సత్తా చాటుతోంది.

Also Read: హాట్ బ్యూటీ లేట్ వయసులో రెండో పెళ్లి !

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’లో భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటిస్తోంది దీపిక. వివాహం తర్వాత కూడా సత్తాచాటుతూ టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. అయితే.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. వీలు చిక్కినప్పుడల్లా భర్త‌తో కలిసి డిన్నర్ డేట్లకు వెళ్తూనే ఉంటుంది. ఇదేవిధంగా.. గురువారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు ఒంటరిగా డిన్నర్ కు వెళ్లింది దీపిక‌.

Also Read: ముంబైలో విజ‌య్ దేవ‌ర‌కొండ.. స్టార్ హీరో కూతురితో రచ్చ!

అయితే.. డిన్నర్ పూర్త‌యిన త‌ర్వాత కారు ఎక్కేందుకు దీపిక బయటకు వచ్చింది. ఆ సమయంలో దీపిక‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. తమ అభిమాన హీరోయిన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీప‌డ్డారు. ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

ఫ్యాన్స్ అంతా చుట్టూ మూగ‌డంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు దీపిక‌కు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఆమె దగ్గరకు చేరి నలిపేశారు. సరిగ్గా అప్పుడే ఓ మహిళ.. దీపిక చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను లాగేసింది. వెంట‌నే ‘ఏక్ మినిట్.. ఏక్ మినిట్’ అంటూ అరిచింది. విషయం గుర్తించిన బాడీగార్డ్స్ సదరు మహిళ నుంచి బ్యాగ్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే కారెక్కి వెళ్లిపోయింది దీపిక

Back to top button