టాలీవుడ్బిగ్ స్టోరీస్

అమ్మ లేకపోతే చనిపోయేదాన్ని.. దేత్తడి హారిక కన్నీటి గాథ..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లోని కంటెస్టెంట్ దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 14 లక్షల సబ్ స్క్రైబర్లతో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే దేత్తడి హారిక నిన్నటి ఎపిసోడ్ లో ఎమోషనల్ అయ్యారు. అభిమానులకు, నెటిజన్లకు తెలియని తన లైఫ్ స్ట్రగుల్స్ గురించి చెప్పారు. అమ్మ లేకపోతే చనిపోయేదాన్ని అంటూ బిగ్ బాస్ హౌస్ లో తన మనస్సులోని బాధను, ఆవేదనను బయటపెట్టారు.

ఎప్పుడూ ఎనర్జీతో, జోష్ గా కనిపించే హారిక తాను ఇంటర్ లో ఉన్న సమయంలో అమ్మ, నాన్న విడిపోయారని చెప్పారు. నాన్న అమ్మ నుంచి వేరైన రోజున కేవలం ఒక బ్యాగ్, పదివేల రూపాయల క్యాష్ మాత్రమే తీసుకొని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లిందని అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కు చూడలేదని తెలిపారు. అన్నయ్య, తాను డాడీ దగ్గర ఉండేవాళ్లమని కొన్ని రోజుల తరువాత అన్నయ్య కూడా అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు.

డాడీ పొద్దున ఆఫీస్ కు వెళితే రాత్రి ఇంటికి వచ్చేవారని.. వేసవికాలంలో ఇంట్లో ఆవకాయ పచ్చడి మాత్రమే ఉండటంతో రోజూ ఆ పచ్చడినే తినేదానని.. ఆ పచ్చడిని ఎక్కువగా తినడం వల్ల తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ ఫామ్ కావడంతో ఇబ్బంది పడ్డానని హారిక చెప్పుకొచ్చారు. డాడీ బైక్ పై వెళ్లి ట్రీట్ మెంట్ చేయించారని.. ఆ తర్వాత తాను కూడా అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయానని అన్నారు.

అమ్మ లేకపోతే తాను, అన్నయ్య ఈపాటికే చనిపోయే వాళ్లమని అన్నారు. బిగ్ బాస్ కు వచ్చే ముందు ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్పారని.. అందులో ఫాదర్ నేమ్ వచ్చేసరికి తండ్రి పేరు మరిచిపోయానని.. ఐదేళ్లలో తండ్రి నుంచి దూరంగా వచ్చేశామని.. తన తండ్రి ఎక్కడ ఉన్నా ప్రేమిస్తూనే ఉంటామని అన్నారు. అన్న చిన్న ఏజ్ లోనే తమ కోసం ఎంతో కష్టపడ్డాడని.. అన్నయ్య తన బ్యాక్ బోన్ అని హారిక చెప్పుకొచ్చారు.

Back to top button