విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో రైల్వే జాబ్స్..?

DFCCIL Recruitment 2021

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు విభాగాలకు సంబంధించిన 1,074 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు సిద్ధమైంది. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్, సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఇతర విభాగాలలో పని చేయాల్సి ఉంటుంది. https://dfccil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లకు అర్హతకు తగిన విధంగా భారీగా వేతనం లభిస్తుంది.

జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి 50 వేల రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్, పవర్ సప్లయ్‌/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు చెందిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమో చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.30 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వేతనం లభిస్తుంది. టెన్త్, ఐటీఐ విద్యార్హత ఉన్నవారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మే 23వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

Back to top button