విద్య / ఉద్యోగాలు

రైల్వేలో 1000కు పైగా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ వేర్వేరు విభాగాల్లో ఖాళీలుగా ఉన్న 1074 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్, ఇతర విభాగాలలో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. https://dfccil.com/ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం లభిస్తుందని తెలుస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజినీరింగ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పవర్ సప్లయ్‌/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇతర విభాగాల్లో డిప్లొమా చేసిన వాళ్లు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు రూ.30 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం లభిస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు టెన్త్, ఐటీఐ చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు వేతనం లభిస్తుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు తుది ఎంపిక జరుగుతుంది.

Back to top button