విద్య / ఉద్యోగాలు

డీజీసీఏలో కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 24 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా https://www.dgca.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 24 ఉద్యోగ ఖాళీలలో కన్సల్టెంట్‌(సీనియర్‌ ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌)(ఏరోప్లేన్‌) ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా కన్సల్టెంట్‌(ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌) (ఏరోప్లేన్‌) ఉద్యోగ ఖాళీలు 19, కన్సల్టెంట్‌(ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌) (హెలికాప్టర్‌) ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. టెక్నికల్‌ నైపుణ్యాలు కలిగి ఉండటంతో పాటు ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

షార్ట్‌లిస్టింగ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 2021 సంవత్సరం ఏప్రిల్ 30 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. దరఖాస్తు హార్డ్ కాఫీలను పంపడానికి 2021 సంవత్సరం పంపించడానికి 2021 సంవత్సరం మే 3వ తేదీ చివరితేదీగా ఉంది.

ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా డీజీసీఏ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తులను రిక్రూట్‌మెంట్‌ సెక్షన్‌, ‘ఎ’ బ్లాక్‌, డీజీసీఏ, అపోజిట్‌ సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌, న్యూ ఢిల్లీ- 110 003 అడ్రస్ కు అభ్యర్థులు పంపాల్సి ఉంటుంది.

Back to top button