సినిమాహాలీవుడ్

హాలీవుడ్ మూవీలో అలరించబోతున్న ధనుష్

Dhanush
ఇండియాలో పాన్ ఇండియా స్టార్ లు , పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి.దక్షిణాది హీరోల సినిమాలు మహా అయితే రెండు లేదా మూడు భాషలలో విడుదలయ్యేవి. కానీ మారిన దర్శకుల ఆలోచనలతో దక్షిణాది సినిమాలు దేశం మొత్తం ఎగబడి చూసేలా ఉంటున్నాయి. దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి మూవీ తో ఉత్తరాది వారికి , దక్షిణాది చిత్ర పరిశ్రమ మీద చిన్నచూపు తొలిగింది . ఆ దెబ్బతో మన సినిమాలలో ఉన్న కంటెంట్ మరియు మన యాక్టర్స్ లో ఉన్న టాలెంట్ దేశం మొత్తం గమనించటం మొదలు పెట్టింది. అలాగే మారుతున్న ప్రపంచంతో పాటుగా మన దేశ చిత్ర పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతూ హద్దులు చెరుపుకుని దేశం దాటి విదేశాలలో కూడా సత్తా చాటుతుంది. దంగల్ , బాహుబలి , ఇంకా కొన్ని సినిమాలు విదేశాలలో కూడా బాగా విజయం సాధించాయి.

Also Read: కరణ్ జోహార్ మెడకు డ్రగ్స్ కేసు… ఆ స్టార్స్ గుండెల్లో రైళ్లు!

అలానే హాలీవుడ్ మూవీస్ కి మన దేశంలో రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. ఇది గమనించిన హాలీవుడ్ వారు మన మార్కెట్ ని తెలుసుకుని వాళ్ళ మూవీస్ ని మన దేశంలో రిలీజ్ చెయ్యటానికి ఆసక్తి చూయిస్తున్నారు.ఇంతేనా వారి సినిమాలలో ఇండియా కి సంబందించిన పాయింట్ ఉండేలా గాని, ఇండియాలోనే షూట్ చేయటం గాని, స్వయంగా వాళ్ళే వచ్చి ప్రొమోషన్స్ చేయటం లాంటివి చేసి ఇక్కడ అభిమానులకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.ఇప్పుడు ఇంకో ముందడుగు వేసి ఏకంగా మన యాక్టర్స్ ని వాళ్ళ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటింపచేయటం మొదలుపెట్టారు.

Also Read: వెయ్యి కోసం కేఫ్ లో పనిచేశా… బాబాయ్ జపాన్ పిల్ల అనేవాడు

విషయంలోకి వెళితే… హాలీవుడ్ మూవీ ” అవెంజర్స్ ” ఫ్రాంచైజీ ప్రపంచం అంతటా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అలంటి మూవీ తీసిన దర్శకద్వయం రుస్సో బ్రదర్స్ రూపొందించబోతున్న నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ లో తమిళ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ క్రిస్ ఎవాన్స్ మరియు ర్యాన్ గోస్లింగ్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.ఇలాంటి మూవీలో ధనుష్ ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ మూవీ కోసం ధనుష్ 45 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం ధనుష్ తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా కూడా హాలీవుడ్ ఆఫర్ రావడంతో డేట్లు సర్దుబాటు చేసుకుని మరీ ఓకే చెప్పాడట. ధనుశ్ ఇప్పటికే ‘ది ఎక్స్‌ట్రార్డరనరి జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించటం జరిగింది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ లో తీసి ప్రపంచమంతా విడుదల చేస్తుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button