తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

25న ధరణి ఫోర్టల్‌ ప్రారంభం : సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

Dharani Portal launches on 25th: CS Someshkumar

విజయదశమి సందర్భంగా ఈనెల 25న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కలెక్టర్లు, అడిషినల్‌ కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 570 మండలాల్లో జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్స్‌ ఈ విధానం ద్వారా ఒకే గొడుగు కింద పనిచేసే అవకాశం ఉంన్నారు. 142 లోకేషన్స్‌లో సబ్‌ రిజిస్ట్రార్స్‌ వ్యవసాయేతర ఆస్తునలు రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి హార్డవేర్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీంతో ఈ సేవల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.

Back to top button