అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలుసంపాదకీయం

భారత్ పై చైనా ‘కరోనా బయో వార్’ చేసిందా?

Did China wage a 'corona bio war' on India?

‘7th sence’ మూవీలో భారత్ పై చైనా కుట్రలు పన్ని ఒక ప్రాణాంతక వైరస్ ను దేశంలో ప్రవేశపెట్టి లక్షల మంది చావుకు కారణమవుతుంది. దాన్ని హీరో సూర్య మన ప్రాచీన సంప్రదాయ ఔషధ మూలికలతో తయారు చేసిన ఔషధంతో కంట్రోల్ చేస్తారు. సినిమా చూడడానికి అప్పుడు ఎంతో ఆసక్తిరేపింది. కానీ ఇప్పుడు దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా సెకండ్ వేవ్ చూశాక.. నిజంగానే చైనా ఈ బయోవార్ ను దేశంలో చేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా మొదటి వేవ్ ను విజయవంతంగా తట్టుకొని నిలబడ్డ భారతదేశ ప్రజలకు ఇప్పుడు సెకండ్ వేవ్ కబళిస్తోంది. అత్యంత శక్తివంతంగా ప్రాణాంతకంగా తయారైంది. భారతీయుల రోగనిరోధకవ్యవస్థను నాశనం చేస్తూ ప్రాణాలు తీస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3780మంది మరణించారు. రోజు వేల సంఖ్యలోనే అనధికారికంగా మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు మించి కేసులు నమోదవుతున్నాయి. దాదాపు దేశంలో కరోనా విలయం చోటుచేసుకుంది.

నిజానికి తొలి కరోనా వేవ్ ను భారతీయులు సమర్థంగా ఎదుర్కొన్నారు. అది అప్పుడు ప్రాణాలు తీయలేదు.దగ్గు, జలుబుతో తగ్గిపోయింది. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తోంది. ఈ సెకండ్ వేవ్ ను ఎవరూ ఊహించనది. ఈ నేపథ్యంలో మొదటి వేవ్ ను తట్టుకున్న భారత్ పై ఏదైనా కుట్ర జరిగిందా? రెండు వారాల వ్యవధిలోనే దేశం మొత్తాన్ని కరోనా ఇంతలా కబళించడం వెనుక ఏదైనా ‘బయోవార్’ జరిగిందా? అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చైనాకు పోటీగా భారత్ ఎదుగుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా సహా అభివృద్ధి చెందిన దేశాలు భారత్ తో నడుస్తున్నాయి.అందుకే బార్డర్ లో 65 ఏళ్ల తర్వాత గొడవ పెట్టుకొని సైనికులతో ఘర్షణకు దిగింది చైనా. కానీ భారత్ వెనక్కి తగ్గకపోవడంతో కుట్రల పన్నుతోందన్న ప్రచారం ఉంది.

కరోనాను సృష్టించింది చైనానే. అది సృష్టించిందా? ఆ దేశంలో పుట్టిందో తెలియదు కానీ.. దాని నిర్మాణ దాత చైనానే. ఇప్పుడు అక్కడ కంట్రోల్ అయ్యింది. వేరే దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేందుకు చైనా ఈ బయోవార్ చేసిందన్న విమర్శలున్నాయి. ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగేందుకు చైనా ఈ కుట్ర పన్నిందన్న ఆరోపణలున్నాయి.

అయితే మొదటి వేవ్ ను తట్టుకున్న భారత్ లోని ప్రజలు , ప్రభుత్వం సెకండ్ వేవ్ పై నిర్లక్ష్యం వల్లే ఇదంతా దాపురించిందన్న విమర్శలున్నాయి. మ్యూటేషన్ చెందిన ఈ వైరస్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళ కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేంద్రం నిధులు ఇచ్చి దేశ ప్రజలకు త్వరగా అందించలేకపోయింది. ప్రపంచానికి పంచి పెద్దన్నగా భారత్ నిలబడింది. కానీ దేశంలోనే పంచి ఇప్పటికే వ్యాక్సిన్ వేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. మోడీ సర్కార్ వైఫల్యం ఇందులొ కొట్టొచ్చినట్టు కనపడింది.

అయితే కరోనా ఎంత మారినా భారతీయుల ఆహార నియమాలు, ఇక్కడి రోగనిరోధకతతో తట్టుకునే శక్తి ఉంది. కానీ ఈ రేంజ్ లో ప్రాణాలు తీస్తోంది అంటే ఖచ్చితంగా దీనివెనుక బయో వార్ ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనానే ఈ కుట్ర చేసిందన్న ప్రచారం సోషల్ మీడియాలో నిపుణులైన వారిలో సాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటుంటే మన దేశంలో మాత్రం ఇంత తీవ్రంగా వ్యాప్తి చెందడం వెనుక బయో వార్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. గాలిలో కూడా కరోనా వ్యాపించడం అంటే అది ఖచ్చితంగా బయో వార్ అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఏదేశంలోనూ జరగకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి.

Back to top button