బాలీవుడ్సినిమా

ఆ సినిమా నుంచి మురగదాస్ తప్పుకున్నాడా? తప్పించారా..!

AR Murugadoss Walks Out Of Vijay Movie

చిత్రసీమలో విజయాలున్న వారికే అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి.. ఒకసారి ప్లాప్ టాక్ తెచ్చుకుంటే ఎంత పెద్ద సెలబెట్రీ అయినా గోళ్లుగిల్లుకోవాల్సిందే.. ప్రస్తుతం దర్శకుడి మురుగదాస్ పరిస్థితి అలానే తయారైందనే టాక్ సినీ వర్గాల్లో విన్పిస్తోంది. విజయ్ సినిమా నుంచి మురగదాస్ తప్పుకోవడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Also Read: మక్కికిమక్కి దించుతానంటే పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

తమిళ దర్శకుడు మురుగదాస్ సౌత్ ఇండియానే టాప్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి.. మహేష్ బాబు.. రజనీకాంత్.. విజయ్ తదితర స్టార్ హీరోలందరికీ మురుగదాస్ సినిమాలు చేశారు. అయితే ఇటీవల కాలంలో మురుగదాస్ తీసిన సినిమాలన్నీప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో మురుగదాస్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

మురగదాస్-విజయ్ కాంబినేషన్లో గతంలో ‘తుపాకీ’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సిక్వెల్ గా ‘తుపాకీ-2’ రాబోతుందని గతంలోనే ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ‘తుపాకీ-2’ నుంచి మురుగదాస్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

‘తుపాకీ-2’ సిక్వెల్ ను నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ అధినేతలను దర్శకుడు మురుగదాస్ కథ మెప్పించలేకపోయిందట. విజయ్ కూడా ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మురుగదాస్ తానే స్వయంగా తప్పుకున్నాడనే టాక్ విన్పిస్తోంది. అయితే కావాలనే మురుగదాస్ ను ఈ సినిమా నుంచి నిర్మాతలు తప్పించారని ఆయన అభిమానులు అంటున్నారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ: ఎన్టీఆర్ టోపీ తీస్తారా? రాజమౌళి కాంప్రమైజ్ అవుతారా?

‘తుపాకీ-2’ కోసం సన్ పిక్చర్స్ కొత్త దర్శకుడిలో వేటలో పడింది. విజయ్ డేట్లు తమ దగ్గరే ఉండటంతో కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించాలని సన్ పిక్చర్స్ యత్నిస్తోంది. దర్శకులు వెట్రిమారన్.. మగిల్ తిరుమణిలు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమోనని పలువురు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Back to top button