జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

మూడోసారి ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణ స్వీకారం

Didi sworn in as Chief Minister for the third time

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్ జగదీప్ ధన్ కడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన బెంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.

Back to top button