క్రీడలుజాతీయంజాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

ఇండియాకు కష్టం.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

Difficult for India .. England won the toss

ఇంగ్లండ్ తో కీలకమైన మూడో ఫైనల్ వన్డేలో ఇండియాకు అదృష్టం కలిసిరాలేదు. టాస్ గెలిస్తే దాదాపు మ్యాచ్ గెలిచినట్టే అన్నట్టుగా పిచ్ ఉంది. భారీ పరుగుల వరదలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపు ఈజీ అవుతోంది. ఈక్రమంలోనే టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకొని లక్ష్యాన్ని చేధించడానికి రెడీ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ టాస్ విసరగా.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. వెంటనే మరో మాట లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ ఓడిపోవడంతో ఇక భారత్ బ్యాటింగ్ చేయడం అనివార్యమైంది. ఇక టీమిండియాలో ఒక మార్పు చేశారు. రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చిన కులదీప్ యాదవ్ స్థానంలో యార్కర్ కింగ్ నటరాజన్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ కూడా టామ్ కరన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ను జట్టులోకి తీసుకుంది.

చెరో మార్పుతో టీమిండియా బరిలోకి దిగింది. టాస్ ఓడడంతో ఇంగ్లండ్ కు ఎడ్జ్ దొరికింది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది.

Back to top button