సినిమాసినిమా వార్తలు

పవన్, బన్నీ, చరణ్ తో దిల్ రాజు మూవీలు

Dil Raju movies with Pawan, Bunny, Charan

Dil Raju

దిల్ రాజు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా తెలుగు, హిందీ సినిమాల ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకటి కాదు రెండు ముగ్గురు మెగా హీరోలతో సినిమాలు చేయబోతున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి సమాచారం ఇవ్వడానికి తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.

దిల్ రాజు తన కెరీర్‌లో 50 కి పైగా చిత్రాలను నిర్మించినప్పటికీ ఇంతవరకు పవన్ తో తీయలేదు. ఆ ముచ్చటను తాజాగా తీర్చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం ‘వకీల్ సాబ్’ నిర్మించి మొదటిసారి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కోసం వకీల్ సాబ్ సన్నద్ధమవుతున్న తరుణంలో సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో పవన్ ఎంట్రీ సినిమా 15వ నిమిషంలో ఉంటుందని దిల్ రాజు ధృవీకరించారు. పవన్ ఎంట్రీ లేట్ అని.. 51 నిమిషాలే ఉంటాడన్న వార్తలను కొట్టిపడేశాడు. దిల్ రాజు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పాడు. పవన్‌తో మరో సినిమాను నిర్మిస్తున్నానని.. ఈ ప్రాజెక్ట్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని తెలిపారు.

మరో వైపు నిర్మాత దిల్ రాజు మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. భారతదేశంలో అతిపెద్ద చిత్ర దర్శకులలో ఒకరైన శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తీయబోతున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. “ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభమవుతుంది” అని దిల్ రాజు ప్రకటించారు.

దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమా ‘థాంక్స్’. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య కథానాయకుడు.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఈ సినిమా ఉందని రాజు వెల్లడించారు. అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయబోతున్నామని దిల్ రాజు తెలిపాడు. ‘ఐకాన్’ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా శ్రీరామ్ వేణుతో ఈ సినిమా తీస్తామని తెలిపారు.

జెర్సీ , హిట్ చిత్రాలను బాలీవుడ్ లో నిర్మిస్తున్నామని.. తెలుగులో రౌడీ బాయ్స్, పాగల్, ఎఫ్ 3 నిర్మిస్తున్నామని తెలిపారు.. సల్మాన్ ఖాన్ సోదరుడితో రీమేక్ మూవీ ఉంటుంది ”అని ఈ ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు. దాదాపు 10 సినిమాల వరకు ప్రస్తుతం నిర్మిస్తూ దిల్ రాజు ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Back to top button