టాలీవుడ్సినిమా

వంశీ సినిమాకు క్లాప్ కొట్టిన దిల్ రాజు

రిలీజ్కు రెడీగా ఉన్న ‘మే 16’..

Vamshi may 16
కరోనా ఎఫెక్ట్ తో నిలిచిన సినిమా షూటింగులన్నీ వాయిదా పడిన సంగతి తెల్సిందే. తెలుగు రాష్ట్రాల సీఎంలు షూటింగులకు గతంలోనే అనుమతి ఇచ్చారు. కొన్నిరోజులుగా షూటింగులు లేకుండా బోసిపోయిన ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సందడి మొదలైంది. గతంలో ఆగిపోయిన సినిమాలతోపాటు కొత్త సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు, హీరోలు రెడీ అవుతున్నారు. తాజాగా ‘నిన్ను తలచి’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో వంశీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read: డబ్బింగ్ లో చైతు ‘లవ్ స్టోరీ’.. పోటీ ఎక్కువైంది !

హీరో వంశీ యకసిరి నటించిన ‘మే 16’ మూవీ ఇప్పటికే రిలీజ్ రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘మే 16’ మూవీని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా భాస్కర్ రామ్ దర్శకత్వంలో నటించేందుకు వంశీ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు ప్రారంభం కాగా ముఖ్య అతిథిగా నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. నటీనటులపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం దిల్ రాజుకు చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మూవీలో వంశీకి జోడీగా ధ్యానద రంత్రికర్ నటిస్తోంది. సస్పెన్స్.. క్రైమ్ థిల్లర్ గా ఈ మూవీని దర్శకుడు భాస్కర్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతోనే ఈ సినిమాను సైన్ చేసినట్లు వంశీ పేర్కొన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు హీరోయిన్ ధ్యానద రంత్రికర్ తెలిపారు. ఈ సినిమా విజయం సాధించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: డ్రగ్స్ ఆరోపణల పై నవదీప్ సెటైర్ !

ఈ సినిమాకు సంగీతాన్ని జయవర్ధన్ అంకె అందిస్తున్నాడు. కోరియోగ్రాఫర్ గా సాయికిరణ్.. కెమెరామెన్ గా రంజిత్ మొగుసాని పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బీ.ఎస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఒర్నటే పిక్చర్స్ ఏల్.ఏల్.పి బ్యానర్ల పై సంగెం బిక్షమయ్య మరియు కృష్ణ మేడ్గేలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా విజయం సాధించేందుకు తన సహాయ సహకారాలు అందిస్తున్న దిల్ రాజుకు చిత్రబృందం ప్రత్యేక ధన్యావాదాలు తెలిపింది.

Back to top button