బాలీవుడ్సినిమా

వక్షోజాలు చూసి సర్జరీ చేయించుకో అన్నారు – ‘ప్రియాంక చోప్రా’

Priyanka Chopra
‘ప్రియాంక చోప్రా’ అంటే ఇప్పుడు యూనివర్సల్ బ్యూటీ. ‘ప్రియాంక చోప్రా’ అంటే ఇంటర్ నేషనల్ స్టార్. ఆమె చూపుల్లోని మత్తుకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అలాంటి ‘ప్రియాంక చోప్రా’ను నువ్వు బాగాలేదు, నువ్వు అసలు హీరోయిన్ గా పనికిరావు అన్నారట. తన ఆత్మకథలో ఈ విషయాల గిరించి చెప్పింది ప్రియాంక, తాజాగా తన ఆత్మకథను విడుదల చేస్తోంది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చింది. అతి త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అయితే, ఈ బుక్ లో ప్రియాంక కాస్త బోల్డ్ గానే రాసుకొచ్చిందట. తన అవయవాల పై కొంతమంది చేసిన కామెంట్స్ ను అంతే బోల్డ్ గా చెప్పేసింది ఈ డస్కీ బ్యూటీ.

Also Read: పిల్లల కోసం రామ్ అనూహ్య నిర్ణయం.. ఆనందంలో సునీత !

ఇంతకీ ప్రియాంక ఏమి చెప్పింది అంటే.. తన కెరీర్ స్టార్టింగ్ లో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు కొన్ని కామెంట్లు చేశారట. ఆ విషయాలు గురించి తెలియజేస్తూ.. “నిజానికి నా ఫీజికల్ అప్పీయరెన్స్ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను, అలాగే నా కెరీర్ ఉంది. అయితే నా కెరీర్ కి పునాదులు పడకముందే కుప్పకూలినట్లు అనిపించింది నాకు, ఒక అందమైన స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెర్చి మూసివెయ్యబడుతున్న ఫీలింగ్ కలిగింది అప్పట్లో. నా కెరీర్ తొలిరోజుల్లో అలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఎంతో బాధపడ్డాను,” అంటూ తన చేదు జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది ప్రియాంక.

Also Read: భర్తతో విడాకులు.. వ్యభిచారిణి పాత్రలో హీరోయిన్ !

ఈ సందర్భంగా ఒక సంఘటన కూడా వివరించింది. ఆ సంఘటన గురించి.. ఆమె మాటల్లోనే “ఒక ఆఫీస్ కి వెళ్ళాను. ఆ దర్శక, నిర్మాత అటు ఇటు తిరుగుమన్నారు. అలా రౌండ్ గా తిరిగాను. నా బాడీని చూసి, అంతా బాగానే ఉంది గానీ, నీ వక్షోజాలు కాస్త చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయి. సర్జరీ చేయించుకో అని చెప్పుకొచ్చారు. అప్పటికే అందెగత్తెగా గెలిచి వచ్చిన నాకు ఆ మాటలు ఎంతో బాధించాయి. అని తన అప్పటి బాధ గురించి అనుభవాల గురించి ప్రియాంక ఈ పుస్తకంలో రాసిందట. గొప్పవారు అందరూ తొలినాళ్లల్లో తీవ్రంగా అవమానింపపడ్డవారే.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

Back to top button