ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్

ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్య నిలిపివేత

Discontinuation of inter education in MR college

విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యను నిలిపివేస్తున్నట్లు మాన్సాస్‌ ట్రస్టు పాలకవర్గం తెలిపింది. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా విజయనగరంలోని ప్రభుత్వ కళాశాలను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌, ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంతకాలం నిర్వహించిన ఇంటర్‌ విద్యను మూసివేస్తున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారన్నారు.

Back to top button