టాలీవుడ్సినిమా

ఆశగా ఎదురుచూస్తున్న చైతు హీరోయిన్ !


సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అనే ఒక రెగ్యులర్ డైలాగ్ ఒకటి ఉంది. అయితే ఛాన్స్ వచ్చినా.. అలాగే సక్సెస్ వచ్చినా.. ఒక్కోసారి లైఫ్ సెట్ అవ్వడం, ఇండస్ట్రీలో నిలబడటం అనేవి చాలా కష్టం. భారీ హిట్ అందుకున్నాక కూడా.. పైగా సంవత్సరం ఎదురుచూసినా కూడా అవకాశం రాకపోతే.. పోనీ యాక్టింగ్ రాదా అంటే.. సూపర్, సరే గ్లామర్ లేదా అంటే.. ఆ విషయంలో అసలు అనుమానమే లేదు. అన్నిటికీ మించి అమ్మడు అందాల బొమ్మ. మరి ఎందుకు అవకాశాలు రావడం లేదు ? ఇంతకీ ఖాళీగా కూర్చొన్న ఆ బ్యూటీ ఎవరు ? ఆమె బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి మెప్పించిన హీరోయిన్ అంటే అందరూ గుర్తు పడతారేమో.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ముఖ్యంగా నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ దివ్యాంశ బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో చైతుని డామినేట్ కూడా చేసింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఈమెకు మంచి పేరు కూడా వచ్చింది. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోవడం, ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూల్లో ఎక్కువగా సమంత మీదే ఫోకస్ చేయడంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ రాకుండా పోయింది. దాంతో దివ్యాంశకు పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు. ఇప్పటికే మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమాలను కూడా ఆల్ మోస్ట్ పూర్తి చేసుకుంటే… దివ్యాంశకు చెప్పుకో తగ్గ ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికీ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

మరి ఏ స్టార్ హీరో కరుణిస్తాడో.. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరికీ దివ్యాంశ కౌశిక్ సరిగ్గా సూట్ అవుతుంది. పైగా మంచి నటి కూడా.. అద్భుతంగా నటించగలిగిన హావభావాలు ఉన్న హీరోయిన్ కి ఛాన్స్ లు రాకపోవడం నిజంగా బాధ కరమే. మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి.. సినిమా సూపర్ హిట్.. కలెక్షన్స్ మాత్రం ఫట్ అన్న మాదిరిగా తయారయిందట. ఒకపక్క సరైన హిట్ అండ్ యాక్టింగ్ లేని హీరోయిన్స్ కూడా మంచి ఆఫర్స్ తో ముందుకు పోతుంటే.. చైతు లాంటి హీరో పక్కన మెయిన్ లీడ్ గా చేసిన దివ్యంశ కౌశిక్ మాత్రం కెరీర్ మొదలుపెట్టిన చోటే ఆశగా ఎదురుచూస్తూ ఉంది.

Tags
Show More
Back to top button
Close
Close