టెక్నాలజీ

ఆధార్ నంబర్ ను మరిచిపోయారా.. ఏ విధంగా కనిపెట్టాలంటే..?

ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన కార్డు అనే సంగతి తెలిసిందే. ఏ చిన్నపనికి అయినా ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే ఆ పని చేయడం సాధ్యమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డ్ నంబర్ ను మరిచిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆధార్ నెంబ‌ర్ అవ‌స‌రం ప‌డితే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఆధార్ కార్డు నంబర్ ను మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయితే మాత్రమే ఆధార్ కార్డ్ నంబర్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌ ను ఓపెన్ చేసి యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి ఆధార్ స‌ర్వీసెస్ మీద క్లిక్ చేసి అందులో ఉన్న ట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.

ఆ తరువాత రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసి ఆధార్ నంబర్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత అక్కడే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కితే మెసేజ్ రూపంలో ఆధార్ కార్డ్ నంబర్ వస్తుంది. ఈ విధంగా ఆధార్ కార్డ్ నంబర్ ను సులభంగా తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ నంబర్ ను మరిచిపోయిన వాళ్లు సులభంగా ఈ విధంగా నంబర్ ను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి అక్కడి సిబ్బంది సహాయంతో ఆధార్ కార్డ్ నంబర్ ను తెలుసుకోవచ్చు.

Back to top button