ఆరోగ్యం/జీవనంప్రత్యేకం

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే..?

మన శరీరంలోని కొన్ని లక్షణాలను బట్టి భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను సులభంగా తెలుసుకోవచ్చు. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మనల్ని అనేక ఆరోగ్య సమస్యలు వేధించవు. అయితే ప్రపంచ దేశాల్లో కిడ్నీ సమస్యలతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కిడ్నీలు పాడైతే మనలో కొన్ని అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

మూత్రం సాధారణ రంగులో కాకుండా రంగు మారితే కిడ్నీల సమస్య కావచ్చని భావించాలి. ఆకలి బాగా తగ్గుతున్నా, నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తున్నా కిడ్నీ సమస్య కావచ్చని భావించాలి. కాళ్లు, చేతులకు వాపునకు లోను కావడం, ఉబ్బినట్లు కనిపించడం కూడా కిడ్నీ సమస్యకు సంకేతాలు అని గుర్తుంచుకోవాలి. తరచూ వికారం, వాంతుల సమస్య ఉన్నా కిడ్నీ సమస్య అయ్యే అవకాశాలు ఉంటాయి.

కిడ్నీలు ఉండే ప్రాంతంలో నొప్పి ఉన్నా, చర్మంపై తరచూ దద్దుర్లు వస్తున్నా కిడ్నీ సమస్య అని భావించాలి. కిడ్నీలు సరిగ్గా పని చేయని వారిని రక్తహీనత సమస్య కూడా వేధించే అవకాశం ఉంటుంది. చిన్న బరువులు మోసినా అలసిపోతూ ఉంటే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. కిడ్నీ సమస్య ఉన్నవారిని శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. పనిపై ఏకాగ్రత తగ్గుతున్నా కిడ్నీ సమస్య అయ్యే అవకాశం ఉంది.

లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా మందులతో కిడ్నీ సమస్యను అధిగమించవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం సమస్య తీవ్రమై కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. కిడ్నీ సమస్య ఉన్నవారికి నాలుకపై రుచి కళికల ప్రభావం కూడా తగ్గడంతో పాటు కళ్లు వాపులకు గురవుతాయి. పైన పేర్కొన్న లక్షణాలు మీలో ఉంటే పరీక్షలు చేయించుకొని మందులు వాడటం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.

 

 

Back to top button