ఆరోగ్యం/జీవనం

కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

మనలో చాలామంది తియ్యగా ఉండే పదార్థాలను, కారంగా ఉండే పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే కాకరకాయ మాత్రం రుచికి చేదుగా ఉన్నా దానిని ఇష్టపడేవాళ్లు చాలామంది ఉంటారు. కాకరకాయను రోజూ తినడం ద్వారా మన శరీరానికి ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జలుబు, జ్వరం, దగ్గు సమస్యలకు చెక్ పెట్టడంలో కాకరకాయ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.

కాకరకాయను ఇష్టపడే వాళ్లు సరిగ్గా వండితే కాకరకాయ చాలా రుచిగా ఉంటుందని చెబుతుంటారు. కాకరకాయతో వేపుడు, పులుసులతో పాటు కారప్పొడి, పచ్చడి, చిప్స్, వడియాలు కూడా చేసుకోవచ్చు. కొన్ని దేశాల్లో కాకరకాయలతో సాఫ్ట్ డ్రింక్స్ ను తయారు చేయగా మరికొన్ని దేశాల్లో కాకరకాయలతో టీ తయారు చేస్తారు. కాకరకాయ ఆకులతో చేసిన టీని చైనీయులు ఎంతో ఇష్టంగా తాగుతారు. పొట్ట రుగ్మతలకు చెక్ పెట్టడంలో కాకరాకుల టీ తోడ్పడుతుంది.

ఆకారాన్ని బట్టి కాకరకాయ పొడవు కాకరకాయగా, పొట్టి కాకరకాయగా లభిస్తుంది. పొట్టిరకం కాకరకాయ వానాకాలంలో, పొడవురకం కాకరకాయ వేసవి కాలంలో లభిస్తుంది. మన దేశంలో గరుకుగా ఉండే కాకర రకాలను ఎక్కువగా అమ్ముతారు. కాకరకాయ శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలను తొలగించే ఔషధంగా పని చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు కాకరకాయ దివ్యౌషధం అని చెప్పవచ్చు.

క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో కాకరకాయ ఎంతగానో తోడ్పడుతుంది. కాకరకాయ మెమోర్డిసిన్ అనే యాంటీ వైరల్ గుణాన్ని కలిగి ఉంటుంది. పొట్ట అల్సర్లకు కారణమైన బ్యాక్టీరియాను నివారించడంలో కాకర సహాయపడుతుంది. ఊబకాయం, మూత్ర వ్యాధులు, కీళ్ల నొప్పులకు కాకరకాయ సులభంగా చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో పాటు ఆస్తమాకు కాకరకాయ చెక్ పెడుతుంది.

Back to top button