ఆరోగ్యం/జీవనంజనరల్

మతిమరపుతో బాధ పడుతున్నారా.. జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..?

మనలో చాలామంది వయస్సు పెరిగే కొద్దీ చిన్నచిన్న విషయాలను మరిచిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా మతిమరపు వల్ల చదివిన పాఠాలనే మళ్లీమళ్లీ చదువుతూ ఉంటారు. మతిమరపు సమస్య చిన్న సమస్యే అయినా ఆ సమస్య వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా సులభంగా జ్ఞాపకశక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది.

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలని భావించే వాళ్లు బ్రకోలీని ఎక్కువగా తీసుకోవాలి. బ్రకోలీ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కె విటమిన్ లభిస్తుంది. బ్రకోలీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మాంసాహారం తినే అలవాటు ఉన్నవాళ్లు చేపలను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. చేపల ద్వారా శరీరానికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు సులువుగా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడులోని షుగర్ లెవెల్స్ ను తగ్గించి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు సహాయపడతాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే గుమ్మడి గింజలు మెదడుతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుమ్మడి గింజలల ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ లభిస్తాయి.

గుమ్మడి గింజలు శరీరంలో నరాల వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో తోడ్పడటంతో పాటు మెదడు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ మెదడును శక్తివంతం చేయడంతో పాటు ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Back to top button