ఆరోగ్యం/జీవనం

వేసవిలో విటమిన్లు లభించాలంటే తాగాల్సిన పానీయాలివే..?

దేశంలో వేసవి కాలం ప్రారంభమైంది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేసవికాలంలో దాహం తీరాలంటే కేవలం చల్లటి నీరు తాగితే సరిపోదు. విటమిన్స్ ఎక్కువగా లభించే కొన్ని ప్రత్యేక పానీయాలను వేసవిలో కచ్చితంగా తీసుకోవాలి.

డైటీషియన్ డాక్టర్ రష్మి శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. విటమిన్స్ ఎక్కువగా లభించే మూడు ప్రత్యేకమైన పానీయాల గురించి ఆమె వివరించారు. వేసవిలో కుకుంబర్-బచ్చలికూర రసం తీసుకుంటే ఎంతో మంచిది. దోసకాయ, అరటి, అల్లం, బచ్చలికూరలను రసంగా మార్చుకుని నిమ్మరసం, రాక్ సాల్ట్ కలుపుకొని తాగితే మంచిది. ఈ రసం ద్వారా శరీరానికి విటమిన్ ఎ, కె, సి, మెగ్నీషియం, కాల్షియం, రాగి మరియు పొటాషియం లభిస్తాయి.

పుచ్చకాయ పుదీనా స్మూతీ తయారు చేయాలంటే పుచ్చకాయ, పుదీనా ఆకులను ముక్కలు చేసి రుబ్బుకోవడంతో పాటు అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలను మిక్స్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ డ్రింక్ ను తాగితే శరీరానికి అవసరమైన జింక్ , ఒమేగా -3 లభిస్తాయి. డ్రై ఫ్రూటీ స్మూతీ తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

జీడిపప్పు, బాదం, అత్తి పండ్లను 30 నిమిషాలపాటు నానబెట్టి రుబ్బుకుంటే డ్రై ఫ్రూట్ స్మూతీ తయారవుతుంది. జీడిపప్పు, బాదం, అత్తి పండ్లను రుబుకుని నునుపైన పేస్ట్ లా తయారు చేసుకున్న తరువాత తీపి కోసం కొద్దిగా తేనెని జోడించాల్సి ఉంటుంది. ఈ పేస్ట్ ను పాలలో కలిపి తాగితే శరీరానికి అవసరమైన ఎ, బి, సి ఇతర విటమిన్లు లభిస్తాయి.

Back to top button