అత్యంత ప్రజాదరణఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

పసుపు పాలతో కరోనా వైరస్ కు చెక్.. ఎలానో తెలుసా..?

Turmeric Milk

చైనా నుంచి భారత్ కు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో గత కొన్ని నెలల్లో ఆయుర్వేదం ప్రాముఖ్యత పెరిగిన సంగతి తెలిసిందే. మనలో చాలామంది ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకు సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు ఆయుర్వేద మందులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. కరోనా కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి పసుపు పాలను ఎక్కువగా తీసుకోవాలి.

పసుపు పాలు అనేక వ్యాధులను దూరం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో పసుపు పాలకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు, శరీర నొప్పులు, గాయాలు, ఇతర ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఆయుష్ మంత్రిత్వ శాఖ గతేడాది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి పసుపుపాలు సహాయపడతాయని చెప్పింది.

రోజుకు ఒకటి లేదా రెండుసార్లు హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి. ప్రతిరోజూ వేడినీటిలో అర టీస్పూన్ పసుపు వేసి తాగితే మంచిది. పసుపు పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి బలంగా ఉండటం సాధ్యమవుతుంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం చికాకు, ఒత్తిడి, నొప్పి, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఎంతగానో తోడ్పడతాయి. ప్రతిరోజూ పసుపుపాలను తప్పనిసరిగా తీసుకుంటే మంచిది.

Back to top button