జనరల్విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..?

ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రముఖ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి ఏకంగా 1809 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగాల భర్తీ జరగనుంది. మార్చి 15వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఏప్రిల్ 14 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://dsssb.delhi.gov.in/>, https://dsssbonline.nic.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభించనుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది.

రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పోస్టులను బట్టి ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండటంతో నోటిఫికేషన్ ను పరిశీలించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్, ల్యాబరేటరీ అటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం, అసిస్టెంట్ కెమిస్ట్, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ 1, పర్సనల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ, సెక్యూరిటీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్, ఇతర ఉద్యోగాల భర్తీ జరగనుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

Back to top button