ఆరోగ్యం/జీవనం

ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాడానికి తినాల్సిన ఆహారాలివే..?

eat these items to increase your immunity and oxygen levels

కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వైరస్ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో మరణిస్తున్న వారిలో చాలామంది సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం కంటే తగ్గితే ప్రమాదమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆక్సిజన్ మన శరీర కణాల్లోని శక్తిని పెంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

బలవర్థక ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. హిమోగ్లోబిన్ ను పెంచే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి విటమిన్ బీ2, కాపర్, విటమిన్ బీ5, విటమిన్ బీ6, ఐరన్, విటమిన్ బీ3, విటమిన్ బీ9, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది.

రాగులు, పీతలు, చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాపర్ లభిస్తుంది. అరటిపండు, బ్రసెల్స్, పాలకూర, కోడిమాంసం, టూనా చేప, పుట్టగొడుగులు, గ్రీన్ లావెర్, పర్ఫెల్ లావెర్ తినడం వల్ల వల్ల శరీరానికి శరీరానికి అవసరమైన బీ6, బీ9, బీ12 లభిస్తాయి. కోడిగుడ్డు, ఆర్గాన్ మీట్, పాలు తీసుకుంటే విటమిన్ బీ2 లభిస్తుంది. కోడి, మేక మాంసం, బీన్స్, పప్పు, ఆకుకూరలు, బఠానీ గింజలు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది.

మాంసంలోని లివర్, గుడ్లు, మామిడికాయ, క్యారెట్, బీట్ రూట్, వెనీలా ఐస్ క్రీమ్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది. మాంసాహారం, అక్రోట్, విత్తనాలు, ఆలుగడ్డ, కాల్చిన సొరకాయ గింజలు, కాల్చిన వేరుశనగ తినడం ద్వారా విటమిన్ బీ3 లభిస్తుంది.

Back to top button