విద్య / ఉద్యోగాలు

ECIL Jobs Hyderabad 2021: ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకు తీపికబురు.. రూ.18,000 వేతనంతో?

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

ECIL Jobs Hyderabad 2021

ECIL Jobs Hyderabad 2021: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ చెందిన ఈ సంస్థ జూనియర్ ఆర్టిజన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మైసూరులో విధులు నిర్వహించాలి. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 జూనియర్‌ ఆర్టిజన్‌ ఖాళీల భర్తీ జరగనుంది. ఫిట్టర్‌ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఆఫ్‌ మెకానికల్‌, ప్రెసిషన్‌ మెకానికల్‌లో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం ఆగష్టు 31వ తేదీలోపు 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈసీఐఎల్‌ జోనల్‌ ఆపీస్‌, ఎల్‌ఐసీ బిల్డింగ్‌, మల్లేశ్వరం, బెంగళూరు సెప్టెంబర్ 17వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

వెబ్ సైట్ ద్వారానే ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనున్న నేపథ్యంలో ఈ జాబ్స్ కు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Back to top button