ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ED Charge Sheet on Jagan: జగన్ ఆస్తుల కేసులో ఈడీ ట్విస్ట్

CM Jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Jagan) అక్రమాస్తులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులున్నా ఈడీ కూడా హైకోర్టు అనుమతితో కేసులు విచారించేందుకు సంకల్పించింది. దీంతో చార్జీషీట్లను దాఖలు చేసింది. పలు కేసుల్లో ఈడీ ఇప్పటికే 7 చార్జీషీట్లు కోర్టుకు సమర్పించింది. వీటిపై న్యాయస్థానంలో విచారణ చేపడుతోంది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జి హబ్ కేసుల్లో మరో రెండు చార్జీషీట్లు కోర్టుకు దాఖలు చేసింది. దీంతో ఈ కేసుల్లో నిందితులందరికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది.

వైఎష్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ఆ(Nimmagadda Prasad) ధ్వర్యంలో చేపట్టిన వాన్ పిక్ ప్రాజెక్టు పై ఆరోపణలు వెల్లువెత్తాయి. గల్ఫ్ లోని రస్ ఆల్ ఖైమా అనే జాయింట్ వెంచర్ తో కలిసి నిమ్మగడ్డ వెంచర్ ప్రారంభించగా అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాల భూమి కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తరువాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. దీంతో సీబీఐ నిమ్మగడ్డపై పలు కేసులు నమోదు చేసింది.

సుమారు రూ.850 కోట్లు నిమ్మగడ్డ జగన్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ దీనిపై దృష్టి సారించింది. తాజాగా ఈడీ చార్జీషీటు నమదు చేసి దర్యాప్తు జరుపుతోంది. దీంతో జగన్ పై పలు కోణాల్లో కేసులు నమోదు కావడంతో అక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు సైతం గొంతు కలిపి జగన్ ను కటకటాల పాలు చేయాలని భావిస్తున్నాయి.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం ప్రభుత్వం వేల ఎకరాలను ధారాదత్తంచేసింది. కానీ అక్కడ పనులు చేపట్టలేదు పైగా ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్లు రుణాలు అప్పుగా తీసుకున్నారు. దీంతో భూముల్ని అప్పగించినందుకు గాను క్విడ్ ప్రో కో తరహాలో జగన్ సంస్థలకు వేల కోట్లు పెట్టుబడులు వచ్చి పడ్డాయి. దీంతో దీనిపై ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించింది.

ఈడీ నిందితులందరికి చార్జీషీట్లు దాఖలు చేపడితే విచారణలో వేగం పెరిగే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే సీబీఐ కోర్టులో వారనలు ప్రారంభించాలని జగన్ తరఫు న్యాయవాదులకు ఆధేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తులకేసులో పురోగతి జరిగితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కనిపిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు సైతం జగన్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి శిక్షలు పడేలాచూడాలని కోరుతున్నారు.

 

Back to top button