లైఫ్‌స్టైల్వ్యాపారము

సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న వంటనూనె ధర..?

Oil Prices Decreases

గడిచిన ఏడాది కాలంలో వంటనూనె ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం లీటర్ పామాయిల్ ధర 150 రూపాయలకు అటూఇటుగా ఉండగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధర 165 రూపాయలు, గ్రౌండ్ నట్ ఆయిల్ ధర 185 రూపాయలుగా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

అయితే అతిత్వరలో సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా వంటనూనె ధరలు తగ్గబోతున్నాయని తెలుస్తోంది. గడిచిన ఏడాది కాలంలో వంటనూనె ధర 55 రూపాయల నుంచి 70 రూపాయలకు పైగా పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులపై అదనపు భారం పడుతుండగా ధరలు తగ్గుతాయని వస్తున్న వార్తల పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్ భారీగా నిలిచిపోగా ప్రస్తుతం ఈ స్టాక్ కు అనుమతి లభించింది.

స్టాక్ కు క్లియరెన్స్ రావడం వల్ల మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వంట నూనె కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడగా ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. మన దేశం వంటనూనె దిగుమతుల కోసం ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత్ ఏకంగా రూ.75 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వంటనూనె ధరలు తగ్గితే సామాన్యులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వంటనూనె ధరలు చిరు హోటల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ధరలు తగ్గితే చిరు హోటల్ వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Back to top button