ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

కాల్వ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు

Kalava Srinivasulu
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో కాల్వ శ్రీనివాస్‌ అరెస్ట్ ఖాయమా..? ఎన్నికల కమిషన్‌ కేసే కదా అని ఆయన లైట్‌ తీసుకున్నారా..? అందుకే.. ఈ ఇబ్బందులా..? కాల్వ శ్రీనివాస్‌ ఇష్యూలో ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి.

Also Read: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు జగన్ గుడ్ న్యూస్

గతేడాది మొదలైన స్థానిక ఎన్నికల్లో రాయదుర్గం పరిధిలో కాల్వ శ్రీనివాస్ అనుచరులు, ముగ్గురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే.. ముగ్గురు పిల్లలున్న కారణంగా వీరి నామినేషన్లను తిరస్కరించారు. దీంతో ఏకంగా కాల్వ రంగంలోకి దిగారు. ఎన్నికల అధికారులను బెదిరించి, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు నేరుగా కేసు పెట్టారు. కాల్వ శ్రీనివాస్ తోపాటు అధికారులపైకి వెళ్లి దౌర్జన్యం చేసిన 24 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదైంది.

ఇన్నాళ్లకు ఆ కేసు స్పీడ్‌ అందుకోవడంతో ముందస్తు బెయిల్ కోసం కాల్వ కోర్టుని ఆశ్రయించారు. అయితే.. అనంతపురం కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో కాల్వ అరెస్ట్ ఖాయమని తేలిపోయింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోర్టు పేర్కొంది. కాల్వ శ్రీనివాస్ కేవలం తన ఆధిపత్యం చూపించుకోడానికే స్థానికంగా రచ్చ చేశాడనే విషయం బహిరంగ రహస్యం ఈ క్రమంలో అధికారులపైనే ఆయన దాడికి ప్రయత్నించారు.

Also Read: పడిపోయిన హైదరాబాద్ గ్రాఫ్‌.. 2014లో 4వ ర్యాంక్.. ఇప్పుడు 24..

దాడి నేపథ్యంలో సకాలంలో పోలీసులు రాకపోతే ఎన్నికల అధికారుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. మొత్తమ్మీద హడావిడి చేయాలని చూసిన కాల్వ ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. అధికారులపై దౌర్జన్యం కేసు కాల్వను ఇప్పుడల్లా వదిలేలా లేదు. మంత్రి హోదాలో ఉన్నా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే.. చట్టం ముందు అందరూ సమానమేననే విషయాన్ని గుర్తెరగాలి కదా..! అందుకే ఇప్పుడు ఈ రిస్క్‌లు తప్పడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button