విద్య / ఉద్యోగాలు

3479 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..?

EMRS Recruitment 2021

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా శుభవార్త చెప్పింది. టీచర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోని 3,479 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ లో 56 జాబ్స్..?

ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం ఉద్యోగాల్లో తెలంగాణలో 262 ఖాళీలు ఉండగా ఏపీలో 117 ఖాళీలు ఉన్నాయి. ఏపీలోని 117 ఖాళీలలో టీజీటీ ఉద్యోగ ఖాళీలు 97 ఉండగా వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీలు 6, ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి. తెలంగాణలోని ఉద్యోగ ఖాళీలలో టీజీటీ ఉద్యోగ ఖాళీలు 168 ఉండగా పీజీటీ ఉద్యోగ ఖాళీలు 77, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీలు 6, ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీలు 11 ఉన్నాయి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో 304 ఉద్యోగ ఖాళీలు..?

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రకియ జరుగుతుంది. ఏప్రిల్ 30వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ మొదటి వారం పరీక్ష నిర్వహిస్తారు. https://tribal.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీటీ, పీజీటీ పోస్టులకు మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Back to top button