క్రీడలుజాతీయంరాజకీయాలు

329కు టీమిండియా ఆలౌట్.. ఫినిషింగ్ ఫెయిల్

england target 330 in third odi

ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన మూడో ఫైనల్ వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లో తడబడింది. ఎవరూ సెంచరీలు చేయలేకపోయారు. భారీ స్కోరును ముందుంచ లేకపోయారు. మంచి ఊపు మీదకు వచ్చాక భారత బ్యాట్స్ మెన్ అందరూ ఔట్ కావడంతో 40 ఓవర్లు వచ్చేసరికి ప్రధాన బ్యాట్స్ మెన్ ఔట్ కావడంతో చివరి పది ఓటర్లు మ్యాచ్ తేలిపోయింది. భారత్ కు పరుగులు రావడం కష్టమైంది. చివర్లో బౌలర్లే ఉండడంతో పరుగులు కష్టమయ్యాయి.

టీమిండియా బ్యాటింగ్ లో రిషబ్ పంత్ 78, హార్ధిక్ పాండ్యా 64 పరుగులతో ఆదుకోవడంతో స్కోరు 329 పరుగులకు చేరింది. అంతకుముందు శిఖర్ ధావన్ 67, రోహిత్ శర్మ 37 పరుగులతో తొలి వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆఖర్లో శార్ధూల్ 30 పరుగులు చేయడంతో ఆమాత్రం స్కోరు సాధించింది.

కోహ్లీ, రోహిత్ లాంటి బలమైన బ్యాట్స్ మెన్ ను తక్కువకే ఔట్ చేసి ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పెద్ద దెబ్బ తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో టీమిండియా తక్కువకే పరిమితమైంది.

ఇక రెండో వన్డేలో 43 ఓవర్లలోనే 337 పరుగులను ఛేదించిన ఇంగ్లండ్ కు ఇప్పుడు 329 పరుగులు సరిపోతాయా? లేదా? అన్నది వేచిచూడాలి.

Back to top button